వైయస్ జగన్ రాజీనామా చేయాల్సింది కాదు: డి శ్రీనివాస్

జగన్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీడియా ద్వారానే తాను జగన్ రాజీనామాను తెలుసుకున్నానన్నారు. జగన్ ఇలాంటి సమయంలో రాజీనామా చేయాల్సింది కాదన్నారు. ఆయన సంయమనంతో ఉండి ఉంటే చర్చలతో అన్నీ సర్దుబాటయ్యేవన్నారు. వైయస్ ఆర్, నేను కలిసి కట్టుగా కాంగ్రెసు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డామన్నారు. అధిష్టానం ఆశీస్సులు కూడా వైయస్ కు, నాకు ఉండేవన్నారు.
ఇద్దరం కలిసి పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి మా పాత్ర మేం పోషించామన్నారు. హైకమాండ్ వైయస్ ను చాలా ప్రోత్సహించిందన్నారు. వైయస్ వెంటే ఉన్న నాకు వైయస్ ను సోనియా ఎలా ప్రోత్సహించిందో తెలుసునన్నారు. జగన్ ఏ కారణాల వల్ల రాజీనామా చేశారో నాకు తెలియదన్నారు. తన లేఖ నాకు ఇంకా అందలేదని, అది అందిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications