వైయస్ జగన్ రాజీనామా దురదృష్టకరం: వీరప్ప మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం దురదృష్టకరమని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. జగన్ రాజీనామా తనకు ఇప్పుడే తెలిసిందని మొయిలీ ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం చెప్పారు. పార్లమెంటు సభ్యత్వానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రం పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అయితే దానిని జగన్ ఉపయోగించుకోలేక పోయాడన్నారు. కుటుంబ సభ్యులను వేరు చేయాలనే ఉద్దేశ్యం పార్టీ కాంగ్రెసు కు గానీ, సోనియాగాంధీకి గానీ లేదని విహెచ్ అన్నారు. వివేకానందకు మంత్రి పదవి ఇవ్వజూపడం కాంగ్రెసు జగన్ ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాదన్నారు. రాజీనామా విషయం వైయస్ జగన్ తమతో చెప్పలేదని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజీనామా చేయాలని జగన్ ఎవరికీ చెప్పలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+