త్వరలో జగన్ కొత్త పార్టీ ప్రకటన: మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్

YS Jagan
హైదరాబాద్: త్వరలో కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన జగన్ కొత్త పార్టీ ప్రకటన వెలువుడుతుందని మాజీ శాసనమండలి సభ్యుడు రెహ్మాన్ సోమవారం అన్నారు. జగన్ రాజీనామాతో కాంగ్రెసుకే నష్టమని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెసు పార్టీ గల్లంతు అవుతుందన్నారు. జగన్ లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఉండనే ఉండదన్నారు.

125 సంవత్సరాల పార్టీ ఇలా చేయటం ఏమిటని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. జగన్ తనంతట తాను పార్టీలోనుండి వెళ్లలేదన్నారు. పార్టీనే ఆయనను రెచ్చగొట్టి బయటకు పంపించిందన్నారు. జగన్ కు జనం బలం ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం జగన్ కు లేదని మల్లాది విష్ణు అన్నారు. జగన్ తో తాను ఉండేది లేనిది సోమవారం సాయంత్రం చెబుతానన్నారు. అయితే జగన్ లేకుంటే కాంగ్రెసు నష్టమేనన్నారు. జగన్ రాజీనామా చేయటం తొందరపాటు నిర్ణయమని సిపిఐ నేత నారాయణ అన్నారు. పార్టీలో ఉంటేనే బావుండేదన్నారు.

మేం ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామని మరో శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ను కాంగ్రెసు అధిష్టానం అవమానించిందన్నారు. ప్రజల అభీష్టం మేరకే జగన్ రాజీనామా చేశారన్నారు. ప్రజారాజ్యాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తానని జగన్ వర్గం పార్లమెంటు సభ్యుడు, సబ్బం హరి అన్నారు. పార్టీ అధిష్టానంతో ఈ విషయమపై మాట్లాడుతానాన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+