మంత్రి పదవి కావాలని చిరంజీవికి వంగా గీత ఆల్టిమేటం?

Vanga Geetha
కాకినాడ: ప్రజారాజ్యానికి చెందిన పిఠాపురం శాసనసభ్యురాలు వంగా గీత ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆల్టిమేటం జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ప్రభుత్వంపై ఉండటంతో ప్రభుత్వానికి ప్రజారాజ్యం అవసరం ఉన్న నేపథ్యంలో చిరంజీవి చేయి అందించడానికి సిద్ధపడటంతో ప్రజారాజ్యంలో సైతం మంత్రిపదవి కోసం పోరు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే వంగా గీత ప్రభుత్వంలో కనుక ప్రజారాజ్యం చేరితే తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆమె చిరంజీవికి ఖచ్చితంగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మంత్రి పదవి ఇవ్వకుంటే తాను పార్టీలో ఉండలేనని చెప్పారు.

అయితే మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీని వీడుతానన్న వార్తలను శాసనసభ్యురాలు వంగా గీత ఖండించింది. పదవి కోసం పార్టీని వదులుకోనని చెప్పారు. తమ పార్టీ అధినేత చిరంజీవి ఎలా చెబితే అలా వింటానని ఆమె చెప్పారు. ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నా, మంత్రి పదవి ఇవ్వాలన్నా అన్నీ తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆ నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని ఆమె చెప్పారు. తను చిరుకు ఆల్టిమేటం జారీ చేసినట్టు వచ్చిన వార్తల పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కాకినాడలో ఉన్న గీత చిరంజీవి పిలుపు మేరకు హైదరాబాదుకు రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+