జగన్ సొంత పార్టీకి రంగం సిద్ధం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట పోస్టర్లు

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. కొత్త పార్టీ పెట్టాలనే ధృడనిశ్చయంతోనే జగన్ ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం జగన్ కడప వెళ్లనున్నారు. అక్కడ వైయస్ సమాధిని సందర్శిస్తారు. తన తల్లి విజయలక్ష్మిని కూడా రాజీనామాకు పురికొల్పుతున్నారు. రాజీనామా అనంతరం జగన్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పెట్టి అధిష్టానానితో అమీతుమీకి సిద్ధమయ్యాడు. జగన్ రాజీనామాకు ముందు తన అనుచరవర్గంతో భేటీ అయ్యారు.

రాజీనామా చేసిన జగన్ కడప పార్లమెంటుకు తాను స్థాపించిన పార్టీనుండే పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. జగన్ కు ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేలు, అంబటి రాంబాబు, గోపాల్ రెడ్డి వంటి పలువురు నేతల మద్దతు ఉంది. అయితే ఎన్నికలకు మరో మూడున్నర సంవత్సరాలు ఉండగా జగన్ తో ఉన్న 14 మందిలో కొందరు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. జగన్ రాజీనామా చేయడానికి ముందుగానే రాజధాని హైదరాబాదులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట అప్పుడే పోస్టర్లు వెలిశాయి. దిల్ సుఖ్ నగర్లో శివకుమార్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా పోస్టర్ ఒకటి వెలిసింది. అయితే ఇందులో జగన్ పాత్ర ఎంతనేది తెలియదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+