కాంగ్రెసులో వైయస్ జగన్ రాజీనామా తుఫాను, రాజీనామాలు

రాజీనామాలు చేయవద్దని వైయస్ జగన్ చెప్పారని, ఏం చేయాలనేది ఆలోచిస్తామని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్ జగన్ మాటను వారు లెక్కలోకి తీసుకోకుండా రాజీనామా చేసేందుకు వారు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కడప జిల్లాలో శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారని అంటున్నారు. ఢిల్లీ పార్లమెంటు హాల్లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి తదితరులు చర్చలు జరిపారు. కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక సంస్థల సభ్యులు రాజీనామాలు చేశారు.












Click it and Unblock the Notifications