వైయస్ జగన్ రాజీనామా: అదే దారిలో వైయస్ విజయలక్ష్మి?

కాగా, వైయస్ విజయలక్ష్మి కూడా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయడానికే ఆమె హైదరాబాదు వచ్చినట్లు భావిస్తున్నారు. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై ఓ బహిరంగ లేఖ రాయడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ కుటుంబంలో చిచ్చు పెట్టినందుకు కలత చెంది వారిద్దరు రాజీనామాస్త్రాలు సంధించనున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు చెక్ పెట్టేందుకే చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనను ఈ రకంగా ఒంటరి చేయడానికి, తనను వేధించడానికి పూనుకుందని వైయస్ జగన్ మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications