మంత్రి పదవి తీసుకునేందుకు వైయస్ వివేకానంద రెడ్డి విముఖత

YS Vivekananda Reddy
కడప: మంత్రి పదవి తీసుకునేందుకు వైయస్సార్ సోదరుడు, ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి విముఖత చూపుతున్నట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ ఎపిసోడ్ లో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆయన కడపకు చేరుకోవడం, వైయస్ జగన్ రాజీనామా చేయడం ఏక కాలంలో జరిగాయి. వైయస్ జగన్ రాజీనామా నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డిపై తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. వైయస్ వివేకానంద రెడ్డి చర్యను వైయస్ జగన్ అభిమానులు వ్యతిరేకించినట్లు, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కడపకు వచ్చిన వైయస్ జగన్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించడమే కాకుండా వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశారు.

కర్త, కర్మ, క్రియ అంతా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియానే అని వైయస్ వివేకానంద రెడ్డి కడపలో అన్నారు. తాను చెప్పేదేమీ లేదని అన్నారు. మీరు చదవమంటే చదువుతా, వినమంటే వింటా అని ఆయన మీడియాపై గుర్రుగా వ్యాఖ్యానించారు. వైయస్ వివేకానంద రెడ్డి నిరాకరిస్తే కడప జిల్లా నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. వైయస్ జగన్ రాజీనామా నేపథ్యంలో కాంగ్రెసు సోనియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+