వైయస్ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది జగనే: ఆనం పైర్

పార్టీలో ఐదు నెలల అనుభువం లేకున్నా ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. జగన్ పై సానుభూతితో కాంగ్రెసు వారందరం ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన విషయం ఆయన మరిచిపోయారన్నారు. కాగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి, కాంగ్రెసు పార్టీలో లాభ పడింది వైయస్ కుటుంబం ఒక్కటేనని మరో నేత షబ్బీర్ అలీ అన్నారు. పార్టీ నాయకురాలు సోనియాగాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేస్తే సహించమన్నారు. వైయస్ జగన్ అనుచరులు గుండాయిజానికి పాల్పడుతున్నారని, దాన్ని సహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications