వైయస్ జగన్ ఎఫెక్ట్: జ్యోతిష్కులతో కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు

వైయస్ జగన్ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి వాస్తు శాస్త్రవేత్తలను సంప్రదించినట్లు సమాచారం. రేపు ముఖ్యమంత్రి కార్యాలయంలో అడుగు పెట్టడానికి సరైన సమయాన్ని చెప్పాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు ఆయన సి బ్లాకులోని ఆరు అంతస్థులోని కార్యాలయం ముస్తాబవుతోంది. వాస్తు ప్రకారం దాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాస్తు పండితులను సంప్రదించి రోశయ్య కూడా కార్యాలయానికి మార్పులు చేయించుకున్నారు. కానీ ఆయన పదవిని నిలుపుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications