అంబటి రాంబాబు పెట్టిన నాగబాబు ఎమ్మెల్సీ సీటు చిచ్చు

అప్పుడు పార్టీ పెట్టే ఆలోచన చిరంజీవి ఇంకా చేయలేదని, తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పిన విషయాన్ని చిరంజీవికి చెప్పానని, తనకేమీ అభ్యంతరం లేదని చిరంజీవి అన్నారని, చిరంజీవిని కాంగ్రెసులోకి లాగడానికి తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామంటే తనకు వద్దని కూడా చెప్పానని నాగబాబు వివరించారు. చిరంజీవి అడిగితేనే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని వైయస్సార్ తనకు చెప్పారని, తన సోదరుడు చిరంజీవి ప్రభుత్వాన్ని యాచించే పద్ధతిని ఇష్టపడరని తాను చెప్పానని ఆయన అన్నారు. ఈ వివరాలన్నీ చిరంజీవికి తెలుసునని ఆయన చెప్పారు. తనకు, తన సోదరుడు చిరంజీవికి మధ్య చిచ్చు పెట్టేందుకు అంబటి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని నాగబాబు అన్నారు.












Click it and Unblock the Notifications