తెలంగాణకు కట్టుబడకుంటే ప్రజలు తిరగబడతారు: హరీష్ రావు

ఓ వైపు ప్రభుత్వం విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారు. వారిని వెంటనే విడిపించడానికి తెలంగాణ మంత్రులు ప్రయత్నించాలన్నారు. విద్యార్థులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని అలా చేయకుండా చూడాలన్నారు. ఎస్ఐ ఉద్యోగాలు వాయిదా పడ్డాయి. విద్యార్థులు ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని కేంద్రంతో ఆమోదింప జేసిన తర్వాత తాను హైదరాబాదీని అనే చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఫ్రీజోన్ విషయంలో తెలంగాణ మంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
కాంగ్రెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి విషయంలో 1984 నుండి మోసం చేస్తుందన్నారు. వాస్తవానికి డిప్యూడి సిఎం వల్ల తెలంగాణకు ఒరిగేది లేదని, అయితే వారే డిప్యూటీ సిఎం ఇస్తామని మాట ఇచ్చారని ఇప్పుడు కట్టుబడ లేక పోయారన్నారు. ఇప్పటికైనా తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications