నాలో ముఖ్యమంత్రికి నచ్చని విషయాలున్నాయేమో: జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy
హైదరాబాద్‌: మంత్రి పదవి దక్కనందుకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఖాయమని జాబితా వెలువడే వరకు ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారు. ఆయన తీవ్ర నిరాశకు గురైనట్లు ఆయన మాటలే తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తనలో నచ్చని విషయాలు ఉన్నాయేమోనని ఆయన బుధవారం ఉదయం అన్నారు. ముఖ్యమంత్రి వాస్తవాలను సరిగా గ్రహించలేదని అనిపిస్తోదని ఆయన అన్నారు.

మంత్రి పదవి రానందుకు నిరుత్సాహం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులో పుట్టానని, చివరి దాకా కాంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రికి చాలా సవాళ్లు ఎదురవుతాయని, వాటిని సమర్ధంగా ఎదుర్కుంటారని భావిస్తున్నానని, అందుకు తన సహకారం అందిస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+