జెసి, కాటసాని ఫ్యాక్షనిస్టులు కావటంవల్లే ఛాన్స్ మిస్?

JC Diwakar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకరె రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డిలు ఫ్యాక్షనిస్టులు అయినందునే మంత్రి పదవులు రాలేదని సమాచారం. ఏఐసిసి నిబంధనల మేరకే పదవుల పందేరం జరిగిందని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. ఫ్యాక్షనిస్టులకు మంత్రిపదవులు వద్దు అని ఏఐసిసి ప్రకటించినందునే వారిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కన బెట్టినట్లు సమాచారం. కాగా శిల్పామోహనరెడ్డికి మొదట మంత్రివర్గంలో తీసుకోవాలనుకున్నప్పటికీ ఆఖరి సమయంలో ఆయన పేరును తొలగించారు.

ఆయన కర్నూల్ జిల్లానుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన కడప జిల్లాకు చెందిన వాడు కావడమే ఆఖరు క్షణాల్లో ఆయన పేరును తొలగించారు. కాగా ఉపముఖ్యమంత్రి పదవి హోంశాఖ చేపట్టే వారికే ఇస్తారని తెలుస్తోంది. హోంమంత్రిగా ఉండబోయే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసినందున ఉపముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెసు నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+