తెలంగాణకు డిప్యూటీ సిఎం ఇస్తామని కిరణ్ మాట తప్పారు: ఆర్. దామోదర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తే రాజీనామాలు చేస్తామని చెప్పినవారు మంత్రులుగా చేరారని, దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే తెలంగాణకు చెందిన మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన మంత్రులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారని, తాము అడగకుండానే హామీ ఇచ్చారని, ఆ పదవి పనికిరానిదైనా హామీ ఇచ్చి ఎందుకు తప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications