చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డితో గొడవ జరగలేదు: వైయస్ జగన్

తమ మధ్య వాగ్వాదం గానీ గొడవ గానీ జరగలేదని ఆయన చెప్పారు. తమ కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వాడుకోవడం తనకు బాధ కలిగించిన మాట వాస్తవమని ఆయన అన్నారు. చిన్నాన్న అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉందని, ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. తమ చిన్నాన్న వివేకానంద రెడ్డిని తమ కుటుంబ సభ్యుడిగానే పరిగణిస్తానని ఆయన చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డికి, వైయస్ జగన్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యగా వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన వెలువరించినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications