రేపే వైయస్ జగన్ క్యాంప్ వ్యూహం ఖరారు: పిల్లి వెల్లడి

వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టాలని ఇది వరకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారంతా కాంగ్రెసు పార్టీని వదిలిపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కోరిక మేరకే తాను మంత్రి పదవి తీసుకోలేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. మంత్రి పదవి తీసుకోవాలని అధిష్టానం తనకు సూచించిందని, అయితే అందుకు తాను ఇష్టపడలేదని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో తమ వైపు ఇంకా ఎవరైనా వస్తారా, లేదా అనే విషయంపై కూడా వైయస్ జగన్ వర్గం దృష్టి పెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications