జగన్ తో స్నేహానికి బిజెపి తహతహ, ప్రయత్నాలు మొదలు

ఇదిలా వుంటే, కొత్తగా పుట్టుకొస్తున్న వైయస్ జగన్ శక్తిని కూడా తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమ పార్టీకి చెందిన కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్ కు మంచి సంబంధాలున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ద్వారా వైయస్ జగన్ తో స్నేహానికి బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొదటి నుంచి కూడా రాష్ట్ర బిజెపి నాయకులు వైయస్ జగన్ పై విమర్సలు చేయడం లేదు. చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు జగన్ ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోసినా బిజెపి నాయకులు మాట్లాడలేదు. వైయస్ జగన్ తో స్నేహం చేయడం ద్వారా ఎక్కువ లోకసభ సీట్ల మద్దతు తమకు లభిస్తుందని బిజెపి భావిస్తోంది.












Click it and Unblock the Notifications