కాంగ్రెసు రాజకీయాలపై చంద్రబాబు పార్టీ నాయకులకు క్లాస్

పనిలో పనిగా చంద్రబాబు తన రాజకీయానుభవాలను పార్టీ నాయకులతో పంచుకున్నారు. తాను కాంగ్రెసులో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డికి పోటీగా దింపి కుతూహలమ్మను ఎలా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చేసిందీ వివరించారు. కిరణ్ కుమార్ రెడ్డి కన్నా అమర్నాథ్ రెడ్డే మంచివాడని ఆయన కితాబు ఇచ్చారు. జాతీయ రాజకీయాల గురించి కూడా ఆయన తన పార్టీ నాయకులకు చెప్పారు. ప్రధానిగా తనకు అవకాశం వచ్చినా ఎందుకు వదులుకున్నదీ ఆయన చెప్పారు. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెసు రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పార్టీ నాయకులకు ధైర్యం నూరిపోశారు.












Click it and Unblock the Notifications