రక్త చరిత్రలో పెద్దాయన వైయస్సారా, అనంతపురంలో భారీ భద్రత

Rakta Charitra 2
అనంతపురం: రక్త చరిత్ర-2 విడుదల సందర్భంగా అనంతపుర్ లోని అన్ని థియేటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రం అనంతపుర్ జిల్లాలో మొత్తం 10 థియేటర్లలో విడుదల అవుతుంది. జిల్లా కేంద్రంలో 3 థియేటర్లలో విడుదల అవుతుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలవుతున్న రక్త చరిత్ర అనంతపుర్ జిల్లాకే చెందిన పరిటాల రవిని బేస్ గా తీసుకోవటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ను పెద్దాయన పాత్రలో విలన్ గా చిత్రీకరించారనే వార్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఇప్పటికే రక్త చరిత్ర పార్టు వన్ చిత్రం విజయవంతమైంది. ఆ చిత్రంలో దివంగత ఎన్టీఆర్ హత్యలను ప్రోత్సహించినట్లుగా చూపించడంతో పరిటాల సునీతతోపాటు తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. దాంతో దానిని తొలగించారు. రక్త చరిత్ర-2లో పెద్దాయన పాత్ర ఉన్నదని, ఆ పాత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పరిటాల రవి అభిమానులు సైతం తమ అభిమాన నాయకుడు రవికి వ్యతిరేకంగా ఉంటే బావుండదని హెచ్చరిస్తున్నారు.

వైఎస్ కు వ్యతిరేకంగా ఉంటే చిత్రాన్ని నడవనిచ్చేది లేదని ఇటు పరిటాల అభిమానులు, ఆటు వైఎస్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. కొందరు రెండువర్గాలను అనుకూలంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ వివాదాలతో పాటు రక్త చరిత్ర-2పై అందరి ఆసక్తి నెలకొనడానికి కారణం పరిటాల రవి హత్య. ఈ పార్టులోనే రవిని ఎవరు హత్య చేశారని చూపించి చిత్రాన్ని రెండు పార్టలతో ముగిస్తాడా, లేదా మరో పార్టు తీస్తాడా అనేది చిత్రం చూశాకనే తేలుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+