రక్తచరిత్ర -2లో స్వామి పాత్ర కెవిపి రామచందర్ రావుదా?

మద్దెలచెర్వు సూరితో ఆయన భార్య భానుమతిని పోటీకి దించే ఒప్పందం జైల్లోనే కుదురుతుంది. భానుమతిని చంపడానికి పరిటాల రవి పాత్ర వెనకాడుతుంది. ఈలోగా ప్రతాప్ రవి ముఖ్య అనుచరుడు హత్యకు గురవుతాడు. దీంతో ప్రతాప్ రవిలో ప్రతీకారం పెరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతాప్ రవిలో విలన్ లక్షణాలు కనిపిస్తాయి. ప్రతాప్ రవిని సూర్య పాత్ర హత్య చేస్తుంది. దాన్ని మొద్దు శీను తన మీద వేసుకుని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లుగా రామ్ గోపాల్ వర్మ చూపించారు. వైయస్సార్ పాత్రను ఎక్కడా ఆయన చూపించలేదు. ప్రతాప్ రవి హత్యకు గురైనప్పుడు స్వామి పగలబడి నవ్వడాన్ని చూపించారు. దీన్ని కెవిపి పాత్రగా ప్రేక్షకులు అన్వయించుకుంటున్నారు. కాగా, సినీ హీరోకు గుండు గీయించే సీన్ సినిమాలో లేదు. ఈ సీన్ ఉంటుందేమోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications