జయప్రకాష్ నారాయణ నోట కిరణ్ కుమార్ పాట: అవినీతిపై కితాబు

Jayaprakash Narayana
హైదరాబాద్‌: లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాట పాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశంసించారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఆయన శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిని దూరం పెడతున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయని ఆయన అన్నారు. పార్టీ పెట్టేది ముఖ్యమంత్రి పదవి కోసమా, ప్రజలకు సేవ చేయడానికా అనేది తేలితేనే వైయస్ జగన్ భవిష్యత్తు తేలుతుందని ఆయన అన్నారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన కూకట్ పల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తమ పార్టీ ఓటమికి జయప్రకాష్ నారాయణ పార్టీ కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+