తొలి షాక్: జగన్ యువసేన అధ్యక్షుడు సత్యారెడ్డి తిరుగుబాటు

వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తాము రాజకీయాలతో సంబంధం లేకుండా తమంత తాము జగన్ యువసేనను ఏర్పాటు చేశామని, దీంతో వైయస్ జగన్ కు సంబంధం లేదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసులోనే ఉన్నామని, కొనసాగుతున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాము కలుస్తున్నామని ఆయన చెప్పారు. టీవీల్లో చూసే వరకు తమకు వైయస్ జగన్ రాజీనామా విషయం తెలియలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications