పిసిసి అధ్యక్ష పదవిపై కన్నేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

ఒకవేళ ఆ రెండు పదవులు తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాల్సి వస్తే రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించి దాన్ని కోస్తా ప్రాంతానికి ఇవ్వాలని వారు పట్టుబడుతున్నట్లు తెలిసింది. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులకు ముఖ్యమంత్రి కిరణ్ సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. ఈ గొడవ వల్లే ఈ పదవుల పంపకం నిలిచిపోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువారం ఢిల్లీ వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. పిసిసి అధ్యక్ష పదవితో పాటు శాసనసభ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులను తేల్చడానికి ఆయన అధిష్టానానికి చెందిన నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications