కిరణ్ కుమార్ కు మందకృష్ణ మాదిగ 24 గంటల డెడ్ లైన్

Manda Krishna Madhiga
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అఖిల పక్ష ప్రతినిధులను ఢిల్లీకి తీసుకుని వెళ్లడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ 24 గంటల డెడ్ లైన్ విధించారు. 24 గంటల లోపల ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీ లోపలే ముఖ్యమంత్రి అఖిల పక్ష ప్రతినిధులను తీసుకుని వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్లడంపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేయకుండా తన కార్యాలయం నుంచి ప్రకటన ఇప్పించడంలోని ఆంతర్యమేమిటని ఆయన అడిగారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ప్రకటనలు చేసేవారని ఆయన గుర్తు చేశారు.

తమ జాతికి చెందిన దామోదరం రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని తమ జాతి ప్రజలు ఎంతో సంతోషించారని, కానీ ఆ ఆశను వమ్ము చేశారని ఆయన విమర్శించారు. మంత్రి జె. గీతారెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో కోస్తా మాల ఉప కులానికి చెందిన పనబాక లక్ష్మికి మంత్రి పదవి ఇచ్చారని, తెలంగాణకు చెందిన మాదిగ ఉప కులానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గకూడదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+