వట్టి వసంత్ కుమార్ కు దొరకని సోనియా అపాయింటుమెంటు

Vatti Vasanth Kumar
న్యూఢిల్లీ: మంత్రి కూర్పులో తనకు కేటాయించిన శాఖపట్ల అసంతృప్తిగా ఉన్న వట్టి వసంత్ కుమార్ కు న్యూఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తనను కలిసేందుకు అపాయింటుమెంటు ఇవ్వలేదు. కాంగ్రెస్ లో చాలా సీనియర్ అయిన తనకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి వట్టి ఢిల్లీ వెళ్లారు. అంతదూరం వెళ్లిన ఆయనకు ఆశాభంగం కలిగింది. ఆదివారం వట్టి అహ్మద్ పటేల్ కలిశారు. సోమవారం మొయిలీని కలిశారు. అయితే మేడం అపాయింటుమెంటు మాత్రం సోమవారం మధ్యాహ్నం వరకు దొరకలేదు.

మరోవైపు సోనియా మాత్రం రాష్ట్రం నుండి పలువురు నాయకులకు మాత్రం అపాయింటుమెంటు లభించింది. జెసి దివాకర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, రాజయ్య, పనబాక లక్ష్మి తదితరులు సోనియాతో సమావేశమయ్యారు. జేసి దివాకర్ రెడ్డి పార్లమెంటు హాలులో సోనియాను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+