వైయస్ జగన్ పై కాంగ్రెసు నేతల ఫైర్, అంబటి రాంబాబు కౌంటర్

వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్టీ చరిత్ర తెలియదని, పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉన్నందు వల్లనే వైయస్సార్ కు ఉన్నత పదవులు దక్కాయని మంత్రి పి. శంకరరావు న్యూఢిల్లీ అన్నారు. వైయస్సార్ అభిమానులంతా కాంగ్రెసు వైపు ఉన్నారని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెసు మహాశక్తి అని, దాన్ని ఎదురొడ్డి ఎవరూ నిలబడలేరని ఆయన హైదరాబాదులో అన్నారు.
కాంగ్రెసు నేతలపై వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు తీవ్రంగా మండి పడ్డారు. వైయస్ జగన్ అంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని ప్రశ్నించారు. వైయస్ జగన్ కు భయపడే ముఖ్యమంత్రిని మార్చారని ఆయన అన్నారు. తులసిరెడ్డి వంటి నేతలతో నీతులు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి తమకు పట్టలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications