వైయస్ జగన్ పై సెటైర్లు విసిరిన పిసిసి చీఫ్ డి. శ్రీనివాస్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన సమస్యలూ లేవని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, సమర్థుడు, పరిపాలనాదక్షుడని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గ కూర్పులో చిన్నపాటి లోపాలు ఉండవచ్చునని, అవి సర్దుకుంటాయని ఆయన చెప్పారు. పనిచేసేవారిపైనే విమర్శలు వస్తాయని, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం విషయంలో జరిగింది అదేనని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఆవేదన ఉండవచ్చునని, రాయపాటితో మాట్లాడి సర్దుబాటు చేస్తామని ఆయన చెప్పారు.
కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి అభ్యర్థుల విషయం ఇప్పుడే వద్దని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుదామని ఆయన అన్నారు. రేపు బుధవారం పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం ఉందని, దానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని ఆయన చెప్పారు. మీరే రాస్తారు, మీరే అడుగుతారని అని ఆయన కిరణ్ కుమార్ తో సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు డిఎస్ సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications