వైయస్ వివేకానంద, జగన్ మధ్య పులివెందుల స్థానికులకు చిక్కులు

YS Jagan-YS Vivekananda Reddy
కడప: బాబాయ్, అబ్బాయిల రాజకీయ విభేదాల మధ్య పులివెందుల ప్రజలు నలిగిపోతున్నారు. స్థానిక నాయకులకు మరీ కష్టం వచ్చి పడింది. వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ తో విభేదించి కాంగ్రెసులోనే కొనసాగాలని నిర్ణయించుకుని మంత్రి పదవిని పొందారు. వైయస్ జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి వెంట ఉండాలా, వైయస్ జగన్ వెంట నడవాలా అనే సందిగ్ధంలో స్థానిక నేతలు పడుతున్నారు. ఒకరి వెంట నడిస్తే మరొకరికి కోపం వస్తుందేమోననే ఆందోళనకు కూడా వారు గురవుతున్నారు.

మంత్రి పదవి స్వీకరించిన వెంటనే వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పర్యటించి హంగామా సృష్టించారు. తనకు మద్దతివ్వాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతూ వచ్చారు. వైయస్సార్ ఆశయ సాధన కోసమే మంత్రి పదవి స్వీకరించానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బాబాయ్ పర్యటన వల్ల ఆందోళనకు గురయ్యారో, ప్రమాదాన్ని పసిగట్టారో గానీ అబ్బాయి వైయస్ జగన్ మంగళ, బుధవారాల్లో కడప పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+