కె చంద్రశేఖర రావు ఎఫెక్ట్: పాఠశాలల సెలవులకు గండి

నిరుడు డిసెంబర్ నెలలో చెలరేగిన ఆందోళనల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. డిసెంబర్ లో తరుచుగా విద్యాసంస్థలు బంద్ పాటించాల్సిన అనివార్యతలో పడ్డాయి. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం డిసెంబర్ లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. డిసెంబర్ లోనే పరీక్షలు పూర్తి చేసి డిసెంబర్ 31వ తేదీలోగా విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా పాలకవర్గాలున్నాయి. దీంతో డిసెంబర్ తర్వాత ఆందోళనల ఉధృతిని తగ్గించవచ్చుననేది ఆలోచన. నిరుడు డిసెంబర్ తలెత్తిన తీవ్ర పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా పాలక మండలి ఆ ఆలోచన చేస్తోంది.












Click it and Unblock the Notifications