చాలా మంది వెళ్లిపోయారు: వైయస్ జగన్ పై సిఎం కిరణ్ కామెంట్

కాగా, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, సరైన సమయంలో సరైన నిర్ణయం మీడియాకు చెబుతానని ఆయన అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఖరారు చేసుకోవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన బిజీగా గడిపారు. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ తో, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సలహా తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో ఆయన భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications