కెసిఆర్ పై నిప్పులు చెరిగిన ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కెసిఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 9వ తేదీన వరంగల్ లో జరిగే తెరాస తెలంగాణ మహాగర్జనకు వెళ్లవద్దని ఆయన మాదిగలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ ఈ నెల 9వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సభకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వివాదాస్పద అంశమని తెలంగాణ రాజకీయ జెఎసి అనడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications