సోనియా చెప్పినట్టు నడుచుకుంటా: దిగొచ్చిన వట్టి వసంత్

Vatti Vasanth Kumar
న్యూఢిల్లీ: ఎట్టకేలకు అసంతృప్త మంత్రి వట్టి వసంత్ కుమార్ కు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింటుమెంటు దొరికింది. వట్టితో సోనియా మంగళవారం మాట్లాడారు. ఆయన విజ్ఞప్తిని సావధానంగా విన్నారు. సోనియాతో భేటీ అనంతరం వట్టి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నాకు సంబంధించిన విషయాలు మేడంతో వివరించామని ఆయన చెప్పారు. నా విషయంలో సోనియాగాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. అధిష్టానం ప్రకారం నడుచుకుంటానన్నారు. మేడంకా రాజీనామా చేసిన విషయాలన్నింటినీ వివరించినట్లు చెప్పారు.

కాగా వట్టి ఈనెల 9న మంత్రిగా బాధ్యతలు స్వీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రోజు సోనియాగాంధీ జన్మదినం కావటం విశేషం. సోమవారం వట్టి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు. వీరికి వట్టి తాను కాంగ్రెసు పార్టీకి చేసిన సేవలను పూర్తిగా వివరించారు. తన తాత, తండ్రులనుండి పార్టీలో ఎలా ఉన్నారనేది చెప్పారు. అధిష్టానం మేరకే నడుచుకుంటానని వట్టి చివరగా చెప్పడంతో మేడంను కలవడానికి అనుమతి లభించింది. కాగా సోనియాతో గాదె వెంకటరెడ్డి, జెడి శీలంలు కూడా భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+