వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో సోనియాకు వాటా ఉందా: అంబటి

వైయస్ ను అవినీతి ముఖ్యమంత్రి అని విహెచ్ లాంటి సీనియర్ నాయకులు అంటుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తానని చెబుతున్నారని ఈ ద్వంద్వ నీతి ఏమిటన్నారు. వైయస్ అవినీతి పరుడు అయితే ఆయన బాటలో నడవాల్సిన అవసరం కాంగ్రెసు కు ఏమిటన్నారు. వైయస్ ను విహెచ్ తోపాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా అవినీతిపరుడు అన్నారన్నారు. అవినీతి పరుడు అనడం కాదని, ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది కాబట్టి వైయస్, జగన్ అవినీతి నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications