వైయస్ జగన్ తో ఒరిజినల్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీనుండి బయటకు వెళ్లి పార్టీ పెడతానని ప్రకటించడంతో ఒరిజినల్ బ్యాటింగ్ ప్రారంభమయిందని, ఈ బ్యాటింగులో ఎవరి దమ్ము ఎంతో చూద్దామని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. జగన్ కోసం పార్లమెంటు సభ్యత్వానికి వదులుకున్న వివేకానంద మంత్రి కాకూడదని జగన్ కోరుకోవటం ఎంత వరకు సమంజసమన్నారు. జగన్ పార్టీ 30 సంవత్సరాలు ఉంటుందా, 30 రోజులు ఉంటుందా త్వరలో తెలుస్తుందన్నారు. జగన్ దగ్గర డబ్బులు పూర్తయ్యాక తెలుస్తుందన్నారు.

జగన్ కు డబ్బులు ఉన్నాయి కాబట్టి తమ పార్టీ జెండాలను అన్ని ఇళ్లపై ఉంటుందన్నారు. కాని జెండాలు పెట్టిన తర్వాత ఎవరు ఉంచుకుంటారో, ఎవరు తీసేసుకుంటారో తెలుస్తుందన్నారు. వైయస్ వివేకానంద జగన్ కోసం మంత్రి పదవి వదలవచ్చు కానీ వివేకా మంత్రిగా ఉండకూడదా అని హనుమంతరావు అన్నారు. సొంత చిన్నాననే ఓర్వలేని జగన్ జనానికి ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. 125 సంవత్సరాల కాంగ్రెసు పార్టీ జగన్ ను చూసి భయపడుతుందని అనుకోవటం తప్పన్నారు. మా వ్యవహారాలు మే చేసుకుంటే భయం ఎలా అవుతుందన్నారు.

పెంచిన కాంగ్రెసు పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామంటే సబబేనా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతికి సోనియాకు సంబంధం లేదన్నారు. సోనియా పిలిచినప్పుడల్లా లక్షల మంది జనాలతో సభలు ఏర్పాటు చేసి తాను ఓ నాయకుడిని అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పినట్టు జగన్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+