కడప, వులివెందుల్లో వైయస్ జగన్ ఎన్నికల సమరం ప్రారంభం

YS Jagan
కడప: వైయస్ జగన్ ఎన్నికల సమరాన్ని ప్రారంభించినట్లే. కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల సమరానికి ఆయన కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని మండలాలవారీ సమావేశాల నిర్వహణ ద్వారా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లేనని చెప్పవచ్చు. ఆయన చేస్తున్న ప్రసంగాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. కడప, పులివెందుల ఎన్నికలను దేశమంతా ఆసక్తిగా చూస్తోందని ఆయన చెప్పారు. కుళ్లుకు, కుతంత్రలకూ సచ్ఛీలతకు, విశ్వసనీయతకు, తెలుగింటి ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. ఉప ఎన్నికల్లో కుళ్లు, కుతంత్రాలతో కూడిన కాంగ్రెసు నీచ రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిస్తున్నారు.

తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకోవడం, మంత్రి పదవి తీసుకోవడం వంటి కారణాల వల్ల ఉప ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలే ఆయన భవిష్యత్తు రాజకీయాలకు పరీక్షగా నిలవనున్నాయి. ఫలితాలు తారుమారైతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయాలపై పడుతుంది. దీంతో ఆయన ముందుగానే తన వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎంత మంది తన వెంట ఉంటారనేది కూడా ఆయనకు అనుమానంగానే ఉంది. దీంతో వైయస్ జగన్ ఉప ఎన్నికలను అలక్ష్యం చేయడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+