వైయస్ జగన్ పార్టీ జెండా రూపకల్పనలో జెఎన్టీయు విద్యార్థులు

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ పార్టీ జెండాకు హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టీయు) విద్యార్థులు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కొంత మంది విద్యార్థులు ఈ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వైయస్ జగన్ కొన్ని సూచనలు చేశారని, ఆ సూచలను దృష్టిలో పెట్టుకుని వారు పతాకను రూపొందిస్తున్నారని అంటున్నారు. మరో 45 రోజుల్లో తన పార్టీ వస్తుందని వైయస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

కాగా, వైయస్ జగన్ కు సంబంధించిన హోర్డింగులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తూ ఈ హోర్డింగులు, పోస్టర్లు వెలుస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని వైయస్ జగన్ తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్ ను బలపరుద్దాం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుదాం అనే నినాదంతో హోర్డింగులు విశాఖపట్నంలో పెద్ద యెత్తున కనిపిస్తున్నాయి. వైయస్సార్ రైతు వేషంలో ఉన్న బొమ్మ ప్రధానంగా చిత్రితమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+