మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

తనను ఆసుపత్రికి తరలించడం దారుణమని మందకృష్ణ విమర్శించారు. ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టంచేశారు. మందకృష్ణ అరెస్టు సందర్భంగా కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆసుపత్రికి తరలించేందుకు వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా వెనుక తలుపుతీసి మందకృష్ణ ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఐదునిమిషాల్లో ఆయనను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications