రాజా ద్వారా లబ్ధి పొందలేదు, బిజెపి హయాంలోనే అక్రమాలు: టాటా

Ratan Tata
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో తాను మాజీ టెలికం మంత్రి ఎ. రాజా ద్వారా ఏ విధమైన లబ్ధి పొందలేదని టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా స్పష్టం చేశారు. ఈ కేటాయింపుల్లో అవకతవకలు బిజెపి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన గురువారం అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను, అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ ఉద్దేశ్యాలతో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ తో పాటు జిఎస్ఎం లాబీయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ టెలికం విధానం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిందంటూ రాజీవ్ చంద్రశేఖర్ రాసిన బహిరంగ లేఖకు సమధానంగా రతన్ టాటా ఆ వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ ఓ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసునని, ప్రధానిని, పాలక పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు రాజీవ్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ ఉద్దేశించిందనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టాటా టెలీ సర్వీసెస్ కు రాజానే కాదు, ఏ మంత్రి కూడా ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+