అహ్మద్ పటేల్ పిలుపు: దాసరి పాత్రకు చిరంజీవి వ్యతిరేకత?

కాంగ్రెసు పొత్తుకు చాలా కాలం నుంచి చిరంజీవి ఆసక్తిగానే ఉన్నారు. రేపో మాపో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు ప్రభుత్వంలో చేరుతుందనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. ప్రజారాజ్యం పార్టీకిచ్చే మంత్రి పదవులు కూడా ఖరారైనట్లు చెప్పారు. అయితే అది ఆచరణ రూపం దాల్చలేదు. ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపిన చిరంజీవి చివరకు తాము ప్రభుత్వంలో చేరడం లేదని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తామని చెప్పేశారు. ఈ స్థితిలో మరోసారి చిరంజీవిని కాంగ్రెసు అధిష్టానం చర్చలుక ఆహ్వానించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications