జయప్రకాష్ నారాయణపై విరుచుకుపడిన కెటి రామారావు

KT Rama Rao
హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడిన లోకసత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు విరుచుకుపడ్డారు. దుమ్ముంటే విద్యార్థులు ఎక్కడ బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. మేధావులమని చెప్పుకునే కొంత మంది ఉద్యమకారులపై కేసుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు.

తెలంగాణ నుంచి గెలిచిన జయప్రకాష్ నారాయణ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ధోరణిని మార్చుకోకపోతే జయప్రకాష్ నారాయణను హైదరాబాదులో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. సోకాల్డ్ మేధావులమని చెప్పుకునే జయప్రకాష్ నారాయణ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బలవంతపు వసూళ్లు చేస్తున్నారని విద్యార్థులపై జయప్రకాష్ నారాయణ తీవ్ర ఆరోపణ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను బీహారులా మారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+