కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ కోవర్టు: యాష్కీ డౌట్

KVP Ramachandara Rao
హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ రాసిన బహిరంగ లేఖపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ సందేహాలు వ్యక్తం చేశారు. వైయస్ జగన్ కు అనుకూలంగా పనిచేయడానికి కాంగ్రెసులో కొనసాగడానికే కెవిపి రామచందర్ రావు నిర్ణయించుకున్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వ్యూహంలో భాగంగానే కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారని ఆయన అన్నారు. ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన లండన్ నుంచి పోన్ లో మాట్లాడారు.

వైయస్సార్ కుటుంబ సభ్యులకు అత్యంత విశ్వాస పాత్రుడు కెవిపి అని, కెవిపిపై విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెసులో కెవిపికి ప్రధానమైన స్థానం లభించేలా చూడడమే వైయస్ జగన్ వర్గం వ్యూహమని ఆయన అన్నారు. కెవిపిపై తాను విమర్శలు చేసినప్పుడు కొండా సురేఖ ఎగిరిపడ్డారని, ఇప్పుడు కెవిపిపై ఆరోపణలు చేస్తుంటే నమ్మాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+