రాత్రి కూడా అసెంబ్లీలోనే ఉండాలని తెరాస శాసనసభ్యుల నిర్ణయం

విద్యార్థులపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ ప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలపై హరీష్ రావు ఓ టీవీ ఛానల్లో ఫోన్లో మాట్లాడుతూ విమర్శించారు. జెపి ఎప్పుడూ తెలంగాణ వ్యతిరేకియేనన్నారు. ఆయన తెలంగాణ వ్యతిరేకత ఇంతకుముందు చాలాసార్లు బహిర్గతమయిందన్నారు. మేధావిని అని చెప్పుకునే జెపి తెలంగాణలోని కూకట్ పల్లినుండి పోటీ చేసి ఇక్కడి వారినే కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి రక్తం కళ్ల చూసినప్పుడు మాట్లాడని జెపి విద్యార్థులపై కేసుల విషయంపై మాట్లాడటం గర్హనీయమన్నారు.












Click it and Unblock the Notifications