తెనాలిలో తొక్కిసలాటలో కింద పడినపోయిన వైయస్ జగన్

కిందపడిన వైయస్ జగన్ ను లేపి పక్కకు తీసికెళ్లడం కూడా గగనమైంది. వైయస్ జగన్ పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించకపోవడం పట్ల వైయస్ జగన్ వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పది మంది పోలీసులు కూడా లేరని వారన్నారు. వైయస్ జగన్ అభిమానులు వెల్లువెత్తుతున్నారని, అది తనకు ఎంతో ఆనందం కలుగుతోందని సినీ నటుడు విజయచందర్ అన్నారు. వరద తాకిడికి తల్లడిల్లుతున్న రైతులను పరామర్శించడానికి ఆయన శుక్రవారం హైదారాబాదు నుంచి తెనాలికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications