వైఎస్ జగన్ వర్గంలోకి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే పేర్ని నాని!

కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు పేర్ని నాని వైఎస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు పేర్ని అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. వైఎస్ జగన్ వర్గం వైపు వెళతామని పేర్ని అనుచరులు ఆయనకు సూచిస్తున్నారంట. దీంతో ఆయన జగన్ వర్గం వైపు వెళ్లేందుకు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. పేర్ని మచిలీపట్టణంలో ఆయన అనుచరులతో ఆదివారం సమావేశమై చర్చించారు. జిల్లాలో జగన్ వర్గం వైపు మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్, జేష్ట రమేష్ బాబు, మేక ప్రతాప్ అప్పారావులు ఉన్నారు. కాగా వైఎస్ జగన్ ఆవనిగడ్డలో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications