ఉపపోరు జగన్ కు సెమీఫైనల్స్ ఐతే నాకు ఫైనల్ అన్న వైఎస్ వివేకా

YS Jagan and Vivekananda
కడప: కడప, పులివెందులలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెమీ ఫైనల్సు అయితే తనకు ఫైనల్స్ అని వ్యవసాయశాఖమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆదివారం అన్నారు. వైఎస్ జగనైనా, నేనైనా ఇద్దరమూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే పని చేస్తామని ప్రకటించారు. ఈనెల 17న పులివెందులలో జరుగనున్న బహిరంగ సభకు అందరూ తరలిరావచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా జగన్ పెట్టే పార్టీలో తాను ఎట్టి పరిస్థితిల్లో చేరబోనని ప్రకటించారు. పార్టీ అనేది జగన్ వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన, తన అన్న మిన్నగా ప్రేమించే కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు. కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడినుండి జగన్ పార్టీ తరఫున దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను జగన్ పై పోటీ చేయడానికి సిద్ధమని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+