బెజవాడ రౌడీలు కోసం వర్మ కుస్తీ, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో భేటీ!

ఇందులో భాగంగా ఆయన విష్ణుతో భేటీ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చిత్రం కోసం కొందరిని వర్మ కలిసి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. వర్మ శనివారం విజయవాడలో సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మెళనంలో పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బైకుపై షికార్లు చేశారు. శాసనసభ్యుడు దేవినేని నెహ్రూతో కూడా భేటీ అయ్యారు. దీంతో ఆయన భేటీలు కలకలం సృష్టిస్తున్నాయి. వాస్తవిక కోణాలను స్పృశిస్తూ వర్మ తలపెట్టిన బెజవాడ రౌడీలు చిత్రం సన్నాహాల్లో భాగంగా వర్మ విజయవాడ చేరుకోవడం, నిన్న ఒక పాటను విడుదల చేయడము తెలిసిందే.












Click it and Unblock the Notifications