అసెంబ్లీలో డిసెంబర్ 31వ తేదీ తర్వాతి భయాల ప్రకంపనలు

Assembly
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత డిసెంబర్ 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతోందో అనే భయాందోళనలకు సోమవారం శాసనసభ అద్దం పట్టింది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత సంభవించబోయే పరిణామాలపై కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నేరుగా ఆ విషయాన్ని చెప్పనప్పటికీ హైదరాబాదులోని ఇతర ప్రాంతాల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. డిసెంబర్ తర్వాతి పరిణామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కన్నబాబు (ప్రజారాజ్యం) ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత సంభవించే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముందుంది ముసళ్ల పండుగ సిపిఐ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. దాని నుంచి బయటపడడానికి కావాల్సిన ఆలోచన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బందిపోట్లపై, నేరగాళ్లపై కేసులను ఎత్తేసినప్పుడు విద్యార్థులపై కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు.

డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏదో ఉపద్రవం వస్తుందని సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని, ఏ విధమైన ఉపద్రవం రాదని, ఆందోళనలు ముందుకు రావచ్చు గానీ ఏ విధమైన ఆందోళనకర పరిస్థితులు ఉండవని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దడానికే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని అనడం సరి కాదని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఉపద్రవం వస్తుంది కాబట్టి ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు వెనకాడుతోందనే అభిప్రాయం సరైంది కాదని ప్రతిపక్ష సభ్యులకు మాటలకు ప్రతిస్పందిస్తూ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తను దృష్టిలో ఉంచుకునే కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆమె చెప్పారు. మిగతా కేసులను కేసువారీగా పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+