తెలంగాణ, ఆంధ్ర సమస్య తీరలేదు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే విద్యార్థుల కేసును పరిశీలించానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర వంటి సమస్యలు ఎత్తి వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసులు ఎత్తివేయాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆవేదన దృష్ట్యా కేసులు ఎత్తివేస్తున్నామన్నారు. అయితే ఏదైనా సమస్య పరిష్కారం పూర్తయ్యే వరకు కేసులు ఎత్తివేసిన దాఖలాలు లేవన్నారు. అలా అయితే అంధ్ర, తెలంగాణ సమస్య పరిష్కారమయ్యే వరకు ఎత్తివేయాల్సిన అవసరం లేదన్నారు. కేసులు ఎత్తివేత విషయం అంటు ఉంచితే, శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, శాంతిభద్రతలపై సమతూకంగా ప్రభుత్వం వెళ్తుందని అన్నారు.

న్యాయపరమైన ఎలాంటి చిక్కులు లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. తగిన సమయంలో మిగిలిన కేసులపై ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. భవిష్యత్తులో హింసకు పాల్పడకుండా విద్యార్థులు ఉండాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడడానికి విద్యార్థులు, రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం సమతూకంగా వెళుతుందని అన్నారు. కొందరు శాసనసభ్యులు కిరణ్ ప్రసంగానికి అడ్డు తగులగా ఆయన నేను హైదరాబాదీనే అని, హైదరాబాదులోనే పుట్టాను, హైదరాబాదులోనే పెరిగాను మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదన్నారు.

విద్యార్థుల కేసుల ఎత్తివేత విషయంలో ప్రాంతీయబేధం లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వంటి సున్నిత అంశంపై ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భావోద్వేగంలో విద్యార్తులు కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించి, వారి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. డిసెంబర్ 9న రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచాలనే భావనతో కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటనతో పాటు విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని చెప్పారన్నారు. ఆ తర్వాత సీమాంధ్రలో ఉద్యమం చెలరేగడంతో కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసిందన్నారు.

శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత సైతం ఉద్యామాలు జరిగాయన్నారు. చిదంబరం కేసులు ఎత్తివేస్తామని అన్నారని విపక్షాలు పలుమార్లు అంటున్నాయి. అయితే చిదంబరం ప్రకటన పరిగణలోకి తీసుకుంటే చాలా తక్కువ కేసులు ఎత్తివేయాల్సి వస్తుందన్నారు. చిదంబరం ప్రకటన తర్వాత కూడా ఉద్యమాలు జరిగాయన్నారు. తెలంగాణ, రాయలసీ, ఆంధ్ర ప్రాంతాల్లో అన్ని కేసులను పరిశీలించామని, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా పరిశీలించాలని తాను సూచించినట్లు సబితారెడ్డి చెప్పారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని రోశయ్య పోలీసు అధికారులకు సూచించారని చెప్పారు.

కేసుల ఎత్తివేతలో ఎలాంటి పక్షపాతం లేకుండా చూశామన్నారు. పోలీసు శాఖకు సాధ్యమైనన్ని కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యతలు తీసుకోగానే విద్యార్థుల కేసులను ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేశారన్నారు. ప్రభుత్వం అన్ని కేసులను ఎత్తివేయాలనే ఉద్దేశ్యంతోనే ఉందన్నారు. అయితే న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నవి మాత్రమే అలా ఉంచామని, ప్రభుత్వం వాటని కూడా పరిశీలిస్తుందని సబితారెడ్డి చెప్పారు. వీలైనన్ని కేసులు ఎత్తివేయడానికే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు అన్నీ సంయమనం పాటించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+