అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేతో చంద్రబాబు పాదయాత్ర

Chandrababu Naidu
హైదరాబాద్: రైతుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం పాదయాత్ర చేశారు. ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం నుంచి శాసనసభ వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఆయనతో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రైతు సమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరించే వరకు శాసనసభను స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులను, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీకి కూడా రానీయకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+